‘బిగ్‌ బాస్‌‌–4’ షూట్‌ లో నాగ్‌ !

తెలుగు ఆడియెన్స్‌ ఎక్కువగా ఎదురుచూసే రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’. ‘స్టార్‌‌‌‌ మా’ ఛానెల్‌ లో ప్రసారమయ్యే ఈ షో ఇప్పటికి మూడు సీజన్స్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగో సీజన్‌ కు రెడీ అవుతోంది. మూడో సీజన్‌ కు హోస్ట్‌‌గా చేసిన స్టార్‌‌‌‌ హీరో అక్కినేని నాగార్జున, నా లుగో సీజన్‌ కు కూడా హోస్ట్‌‌గా చేస్తున్నారు. ఇంతకాలం ఈ షో హోస్ట్‌‌గా ఎవరు చేస్తారు? అనే విషయంపై అనేక పేర్లు వినిపించినప్పటికీ, ఫైనల్‌ గా నా గార్జున హోస్ట్‌‌గా రానున్నారు. నాగ్‌ ఇంతకుముందు చేసిన మూడో సీజన్‌ మంచి సక్సెస్‌ అయింది. నాలుగో సీజన్‌ కు సంబంధించిన ప్రోమో షూట్‌‌లో కూడా నాగ్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది.

హీరో తరుణ్‌ , హీరోయిన్ శ్రద్ధా దాస్‌ , యాం కర్‌‌‌‌ విష్ణు ప్రియ, యూట్యూబ్‌  ఫేం సునయన వంటి పేర్లు తెరపైకి వచ్చినా, వాళ్లు ఈ షోలో చేయడంలేదని చెప్పారు. సాధారణంగా ఈ షోలో సినిమా, టీవీ నటులతోపాటు సింగర్స్‌ , సోషల్‌ యాక్టివిస్ట్‌‌లు, సోషల్‌ మీడియా/యూట్యూబ్‌ స్టా ర్స్‌ పార్టిసిపేట్‌‌ చేస్తుంటారు. ఈసారి కూడా అందరికీ స్థానం ఉంటుంది. అయితే కరోనా కారణంతో షోలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, కాన్సెప్ట్‌‌లోనూ కొన్ని మార్పులు జరగనున్నాయి. వీకెండ్‌ లో హోస్ట్‌‌ కనిపించే ఎపిసోడ్‌ లో లై వ్‌ ఆడియెన్స్‌ ఉండరు. అలాగే కంటెస్టెంట్స్‌ కు హౌజ్‌ లో ఇచ్చే టాస్క్‌ లు, గేమ్స్‌ విషయంలో కూడా రూల్స్‌ మార్చనున్నారు. ఇంతకుముందు లాగా వంద రోజులపాటు కాకుండా, పది వారాలు మాత్రమే ఈ షో సాగే ఛాన్స్‌ ఉంది. తాజా అంచనా ప్రకారం ఈనెల చివరి వారంలోపు ఈ షో స్టా ర్ట్‌‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

 

Latest Updates