మూడు సినిమాలు రూ.40 కే.. పైరసీ సిడీలతో నిఖిల్!

పైరసీ భూతం సినీపరిశ్రమని అతలాకు తలం చేస్తున్న సంగతితెలిసిందే. ఇలా రిలీజైన సినిమా అలా పైరసీలో రిలీజైపోవడమే గాక
పబ్లిక్ గా మార్కెట్లో సీడీలు, డీవీడీల రూపంలో అందుబాటులోకివచ్చేస్తున్నాయి. రీసెంట్ గా హీరో నిఖిల్ ఓ పైరసీ సీడీల షాప్ ని బహిరంగంగా పట్టుకు న్నాడు. తాను నటించిన అర్జున్ సురవరం ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే.. సీడీలు విక్రయిస్తున్న తోపుడు బండినివీడియో తీసి మరీ సోషల్ మీడియాలో అందరికీ చూపించాడు. ఈ బండి మీద చాలా కొత్త సినిమా ల సీడీలు ఉన్నాయి. ఆసీడీలు అమ్మే మహిళకు నిఖిల్ సినిమా వాళ్ల బాధల్ని వివరించి చెప్పిన తీరు బావుంది. అలాగే ఇలా థియేటర్లో సినిమా ఉండగానే నలభై రూపాయలకి సీడీఅమ్మేయడం దారుణమంటూ ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. టీ తాగేందుకు ఆగినప్పుడు ఇవన్నీ తన కంటబడ్డాయట. నిఖిల్చేసిన ఈ పనికి అందరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఇలాంటివి చూసైనా పైరసీని అరికట్టేందుకు సీరియస్ చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో.

 

Latest Updates