రియల్ హీరో: కరోనా కట్టడికి నితిన్ రూ.10లక్షలు సాయం

హైదరాబాద్: నితిన్ రియల్ హీరో అనిపించుకున్నాడు. క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు రూ.10లక్షలు సాయం అందించాడు ఈ తెలంగాణ హీరో. మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్ ను కలిసి చెక్కును అందజేశాడు. మిగతా వారు కూడా సాయం అందించాలని పిలుపునిచ్చాడు నితిన్. అటు ఏపీకి కూడా నితిన్ రూ. 10 లక్షలు సాయం అందించాడు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆయన..  కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని అభినందించారు. ప్రజలందరూ ప్రభుత్వాలకు సహకరించాలని రిక్వెస్ట్ చేశాడు. తనవంతు సాయంగా తెలంగాణ, ఏపీ సీఎంల సహాయ నిధికి విరాళం అందిస్తున్నట్లు చెప్పాడు. లాక్‌‌ డౌన్‌‌ కు ప్రజలు సహకరించాలన్నాడు నితిన్.

Latest Updates