‘అంధాధున్ ’ రీమేక్ లో నితిన్

భారీ స్టార్ కాస్టింగ్, హై బడ్జెట్ అని చూడకుండా కాన్సెప్ట్ నచ్చితే చిన్న చిత్రాలకి కూడా అగ్ర సింహాసనం వేస్తున్నారు ప్రేక్షకులు. ఇటీవల
వచ్చిన బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఎవరు చిత్రాల విజయమే ఇందుకు నిదర్శనం. నితిన్ కూడా ఈ తరహా
చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించిన ‘అంధాధున్ ’ మూవీ పోయినేడు
బాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. అది మొదలు  ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం చాలామంది నిర్మా
తలు పోటీ పడ్డారు. అయితే ఈ రైట్స్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. మాతృక నిర్మాతైన వయాకామ్ 18 తెలుగులోనూ నిర్మాణ
భాగస్వామిగా వ్యవహరించనుందట. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఆయుష్మాన్ ఖురానా కళ్లు లేని వ్యక్తిగా మెప్పించాడు.

ఇప్పుడా పాత్రని నితిన్ పోషించబోతున్నాడు. దర్శకుడు ఎవరన్నది ఇంకా కన్ ఫర్మ్ అవలేదు. ప్రస్తుతం భీష్మ, రంగ్ దే చిత్రాల షూటింగ్‌‌తో బిజీగా ఉన్న నితిన్‌‌ చేతిలో మరో రెండు చిత్రాలు కూడా చేతిలో ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక ఈ రీమేక్ సెట్స్‌‌కి వెళ్లనుంది. సరైన కథాకథనాలతో వస్తే థ్రిల్లర్ సినిమాలు కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటాయని ఇటీవల ‘రాక్షసుడు’ నిరూపించింది. ‘అంధాధున్’ కూడా అదే తరహాలో మెప్పిస్తుందేమో చూడాలి!

Latest Updates