భూవివాదం కేసులో ప్రభాస్ కు ఊరట

హైదరాబాద్‌, వెలుగు: భూవివాదం కేసులో హీరో ప్రభాస్ కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా శేరిలిం గంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో ప్రభాస్ కొనుగోలు చేసిన భూమి నుంచి ఆయనను ఖాళీ చేయించడం చట్ట వ్యతిరేకమని జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన బెంచ్ ప్రకటించింది. భూమి క్రమబద్ధీకరణ దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని, తీర్పు ప్రతి అందిన 8 వారాల్లోగా పరిష్కరిం చాలని ఆదేశించింది.

ఆ ప్రాంతంలో60 ఏండ్లుగా భూవివాదం ఉన్నందున ప్రభాస్ కు భూమిని స్వాధీనం చేయాలని ఉత్తర్వులు ఇవ్వలేకపోతున్నామని తీర్పు చెప్పింది. ప్రభాస్‌ క్రమబద్ధీకరణ దరఖాస్తును ఆమోదించాలని ఉత్తర్వులిస్తే.. మిగిలినవారూ దరఖాస్తులు చేసుకుంటారని, అందుకే చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది.

Latest Updates