మీవల్లే సాహో కు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది

సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కిన మూవీ ‘సాహో’. రిలీజై మిశ్రమ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా  వసూళ్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా.. 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో హీరో ప్రభాస్ తన అభిమానులకు, సినీ ప్రేమికులకు థ్యాంక్స్ చెప్పాడు. మీవళ్లే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని..అభిమానుల  ప్రేమకు సదా దాసుడినని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సాహో’ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందివ్వగా… ఆర్. మది సినిమాటోగ్రఫి చేశారు.

Latest Updates