వైద్యరంగలో జరిగే తప్పులను మోడీ దృష్టికి తీసుకెళ్లాలి

హైదరాబాద్ : వైద్య రంగంలో అర్హత లేని డాక్టర్లు చాలా మంది ఉన్నారన్నారు నటుడు రాజశేఖర్. గురువారంఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద ఆందోళన చేస్తున్న జూడాలకు మద్దతు తెలుపుతూ మట్లాడారు జీవితరాజశేఖర్. వైద్య రంగంలో జరిగే తప్పులను మోడీ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపిన రాజశేఖర్.. వైద్య రంగంలో కొత్త చట్టాలు, బిల్లులు అనేది వైద్యరంగ నిపుణుల ద్వారా తేవాలన్నారు. బిల్లు కోసం కమిటీ వేశారని..ఆ కమిటీలో IAS, రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఆరునెలల కోర్సు చేస్తే డాక్టర్ అవుతాడు అనేది హాస్యాస్పదంగా ఉందన్నారు.

బ్రిడ్జి కోర్సు వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు రాజశేఖర్. ఇప్పటికే చెయ్యని తప్పులకు డాక్టర్లు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అనేది ప్రజలకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలు ఉండాలన్న ఆయన..తొందరపాటుగా నిర్ణయాలు ఉండకూడదన్నారు. ప్రజలకు అన్యాయం చేసే విదంగా నిర్ణయాలు ఉంటే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పును ఇస్తారని చెప్పారు. NMC బిల్లులో తప్పులను కేంద్రం సవరణలు చెయ్యాలన్నారు రాజశేఖర్

Latest Updates