హీరో రామ్ కు రూ.200 ఫైన్

hero-ram-fine-no-smoking-zone

హైదరాబాద్ : హీరో రామ్ కు షూటింగ్ లో  చేదు అనుభవం ఎదురైంది. నో స్మోకింగ్ ఎరియాలో సిగరేట్ తాగినందుకు రూ. 200 ఫైన్ వేశారు అధికారులు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లోని చార్మినార్ పరిసరాల్లో జరిపారు. సినిమాలో రామ్ సిగరేట్ తాగే సీన్ షూట్ జరుపుతుండగా..అక్కడ నో స్మోకింగ్ ఏరియా బోర్డు ఉంది. దీంతో హీరో రామ్ కు చట్ట రీత్యా రూ.200 ఫైన్ విధించినట్లు తెలిపారు చార్మినార్ సీఐ.

రామ్ ‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా..జూలై 12న విడుదల కావాల్సి ఉంది. అయితే వరల్డ్ కఫ్ ఫైనల్ జూలై14న జరగనుంది. వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ ఎక్కువగా ఉండటంతో ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డేట్‌ను జూలై 12 నుంచి 18కి వాయిదా వేసింది.

Latest Updates