ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ : సీఎం జ‌గ‌న్ గారు జాగ్ర‌త్త‌..మిమ్మ‌ల్ని వెన్నుపోటు పొడుస్తారు

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య‌వాడ స్వ‌ర్ణ ప్యాలెస్ చెందిన డాక్ట‌ర్. రమేష్ ఆసుపత్రి యాజ‌మాన్యం పై హీరో రామ్ స్పందించారు.

డాక్ట‌ర్ ర‌మేష్ త‌న మామ‌య్య అని. రమేష్ హాస్పిట‌ల్స్ గుంటూరు, విజ‌య‌వాడ‌లో ఉన్నాయ‌ని అన్నారు. త‌న మామ‌య్య ర‌మేష్ త‌న కుటుంబానికి ఎంతో ఇన్స్పి‌రేష‌న్ అంటూ రామ్ వ‌రుస ట్వీట్ చేశారు.

ఏపీ ఈజ్ వాచింగ్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసిన ఆయన అగ్నిప్రమాదంపై పెద్ద కుట్ర ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ ప్ర‌మాదాన్ని అడ్డుగా పెట్టుకొని సీఎం జ‌గ‌న్ పై బురదజల్లే ప్రయత్నం జ‌రుగుతుంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. వైఎస్ జగన్ రెప్యుటేషన్‌కు, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికీ డ్యామేజ్ కలుగుతోందంటూ.. కొన్ని బిల్స్ ను ఆయ‌న ట్వీట్ ల‌లో యాడ్ చేశారు.

ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్

అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా..? అంటూ ప్ర‌శ్నించారు. మేనేజ్ మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ ప్యాలెస్ డైర‌క్ట్ గా బిల్లింగ్ చెల్లించింద‌ని అన్నారు.

ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌మాదం జ‌రిగితే ఎవ‌రిని అడిగే వారు

హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింద‌న్న రామ్ .. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లని హీరో రామ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Latest Updates