ఊర మాస్ డైలాగ్స్ తో ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్

hero-ram-issmart-shanker-mass-trailer

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ హీరోగా నటించిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్’. జూలై-18న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ను బుధవారం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. రామ్ ఊరమాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడంటున్నారు ఫ్యాన్స్. 2 నిమిషాల 13 సెకన్లున్న ఈ మూవీ ట్రైలర్ ప్రారంభంలో ‘ఏ బొమ్మా.. నువ్వు ఊ.. అంటే గోల్కొండ రిపేర్‌ చేసి నీ చేతిలో పెడతా.. నిన్ను బేగంని చేసి ఖిలా మీద కూర్చోపెడతా’ అనే డైలాగ్‌ తో ట్రైలర్‌ మొదలైంది.

‘నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ..’ అంటూ రామ్‌ చెబుతున్న డైలాగ్, నభా నటేశ్‌ తెలంగాణ యాసలో రామ్‌ ను బెదిరిస్తున్న సీన్ నవ్వులు పూయిస్తోంది. ఇవేగాక మరిన్ని పక్కా తెలంగాణ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రామ్‌ యాటిట్యూడ్‌ ట్రైలర్‌ లో హైలైట్‌ గా నిలిచిందంటున్నారు. నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ ల గ్లామర్ తో పిచ్చెక్కిచ్చారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌ పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తో ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచుతోంది.

Latest Updates