తల్లిదండ్రులకు బాధ కలిగించకండి : సంపూ

hero-sampoornesh-babu-fan-hungama

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఆగస్టు-10న రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కొబ్బరిమట్ట తమ ఏరియాలో రిలీజ్ కాలేదని సంపూ అభిమాని వీరంగం సృష్టించాడు. రెడ్డప్ప అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. వెంటనే తమ ఏరియాలో కొబ్బరిమట్ట సినిమాను ప్రదర్శించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లె చంద్రా కాలనీలో జరిగింది.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. కానిస్టేబుల్‌ సహాయంతో రెడ్డెప్పను కిందకు తీసుకొచ్చారు. ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించాడు హీరో సంపూర్ణేష్ బాబు..’దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి, మీ తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. సినిమా ఇప్పుడు కాకపోతే రెండు రోజుల తర్వాత చూడొచ్చు’ అని ఆయన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

Latest Updates