మరో డిఫరెంట్ రోల్ కు ఓకె చెప్పిన శర్వానంద్

తన ప్రతి సినిమాకీ వెరైటీ చూపించాలని తపించే శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తను కమిటయిన సినిమాలన్నీ దేనికదే డిఫరెంట్. వీటి వరుసలో తాజాగా మరో సినిమా చేరింది. గత కొన్నినెలలుగా ప్రచారంలో ఉన్న ‘మహాసముద్రం’ సినిమాకి సంబంధించిన అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చేసింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్‌ అజయ్ భూపతి దర్శకుడు. ‘సరిలేరు నీకెవ్వరు’తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్  అందుకున్న అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుంకర తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్ అంటూ ఈ సినిమాని సోమవారం ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ మూవీకి సంబంధించి ప్రతి వారం ఒక్కో సెన్సే షనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రివీల్ చేయనున్నట్టు కూడా నిర్మాత చెప్పారు. ఈ ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాలో శర్వానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్ పోషించనున్నాడు. అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపతి ఒక పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ స్క్రిప్ట్ రెడీ చేశాడు. మల్టీస్టారర్ కావడంతో ప్రాజెక్ట్ ఓకే అవడానికి కొంత ఆలస్యమైంది. త్వరలోనే ఇతర వివరాలన్నింటినీ టీమ్ రివీల్ చేయనుంది.

 

Latest Updates