కారు ప్రమాదంలో మహిళ మృతి..హీరోకు గాయాలు

గుంటూరు : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కోమకుల కారు ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. ఈ ప్రమాదంలో హీరో సుధాకర్ గాయలపాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. మంగళగిరి మండలం చినకాకాని దగ్గర వేగంగా వెళ్తున్న హీరో సుధాకర్ కోమకుల కారు.. జాతీయ రహదారిపై వాటర్ ట్యాంక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ వెనకా ట్యంకర్ తో చెట్లకు నీళ్లు పడుతున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా.. హీరోకు గాయాలయ్యాయి.

సుధాకర్ లేటెస్ట్ గా హరినాథ్ బాబు దర్శకత్వంలో ‘నువ్వు తోపు రా’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కు తరలించామని తెలిపిన ఆమె వివరాలు సేకరిస్తున్నామన్నారు.

Latest Updates