నేను క్షేమంగానే ఉన్నా : సునీల్

తాను క్షేమంగానే ఉన్నానని టాలీవుడ్‌ నటుడు సునీల్‌ చెప్పాడు. సునీల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఓ వెబ్‌ సైట్‌ తప్పుడు వార్తను రాసింది. దీన్ని చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు సునీల్‌ ట్విటర్‌ లో స్పందించాడు. ఆ వార్తల్ని నమ్మొద్దని అభిమానుల్ని కోరాడు. ‘అది తప్పుడు వార్త. నేను క్షేమంగా ఉన్నా. దయచేసి ఆ వార్తను నమ్మొద్దు’ అని సునీల్‌ ట్వీట్‌ చేశాడు. వ్యూస్‌ కోసం ఇలాంటి వార్తలు రాసే వారిని శిక్షించాలని అభిమానులు కామెంట్లు చేశారు.

 

Latest Updates