ఉప ఎన్నికల నేపథ్యంలో హీరో ఉపేంద్ర కీలక ప్రకటన

డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న నటుడు ఉపేంద్ర. ఆయన కర్ణాటక రాజకీయాల దృష్ట్యా గత సంవత్సరం అంటే సెప్టెంబర్ 18, 2018న ఉత్తమ ప్రజాకీయ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై.. స్పీకర్ చేత అనర్హత వేటుకు 17 మంది ఎమ్మెల్యేలు గురయిన విషయం తెలిసిందే. ఆ స్థానాల్లో త్వరలో ఉపఎన్నికలు జరగబోతున్నాయి.

ఆ ఉప ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఆయన ట్విట్టర్‌లో ఒక కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉప ఎన్నికలలో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు. అలాగే నాయకుడి నుండి అధికారాన్ని ప్రజలకు ఎలా బదిలీ చేయాలనే దానికోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దాంతో ఆ పార్టీ నాయకులు మరియు ఆయన అభిమానులు ఉపఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

Latest Updates