వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్

hero-varun-tej-car-accident

హీరో వరుణ్ తేజ్ కు ప్రమాదం తప్పింది. బుధవారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది.  వనపర్తి జిల్లా కొత్తకోట (మం) రాయిని పెట్ స్టేజి దగ్గర NH44 నేషనల్ హైవే దగ్గర వరుణ్ ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పింది. ప్రమాదంలో కారు డ్యామేజ్ కాగా..వరుణ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు వరుణ్ తేజ్.  ఇండిక కారును ఢీకొన్న హీరో వరుణ్ తేజ్ ఆడి కారు.. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో హీరో వరుణ్ తేజ్ కు ప్రమాదం తప్పింది.

ఇండిక కారులో ఉన్న ముగ్గురికి సల్ప గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు వరుణ్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ మరో కారులో బెంగళూరుకు వెళ్లాడు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మికి సినిమాలో నటిస్తున్నాడు.

Latest Updates