ప్రియా ఆనంద్‌ డిజిటల్‌ డెబ్యూ

ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ పై వెబ్‌ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో చాలా మంది స్టార్లు ఒక్కొక్కరుగా వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. సరైన ప్రాజెక్ట్‌‌ సెట్‌ అయితే, వెబ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు చాలా మంది స్టార్స్‌ రెడీగా ఉన్నారు. వెబ్‌ సిరీస్‌ ఎంట్రీ ఇస్తు న్న తారల జాబితాలో నటి ప్రియా ఆనంద్‌ చేరింది. తెలుగులో లీడర్‌‌‌‌, రామరామ కృష్ణకృష్ణ వంటి సినిమాల్లో నటించిన ప్రియా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది. అయితే తమిళం, హిందీ, మలయాళంలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా మాత్రం మారింది. ఇప్పుడు ‘సింపుల్‌ మర్డర్‌‌‌‌’ అనే హిందీ వెబ్‌ సిరీస్‌ ద్వారా డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో ఆమెతోపాటు సచిన్‌ పాఠక్‌‌, ముఖేష్‌ చబ్రా, అయాజ్‌ ఖాన్‌ మెయిన్‌ లీడ్స్‌ చేస్తు న్నారు. ఈమధ్యే షూటింగ్‌ మొదలైన ఈ సిరీస్‌ త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌ అవుతుంది.

Latest Updates