రూ.105 కోట్ల విలువైన హెరాయిన్ ​పట్టివేత

కోల్​కతా: కోల్​కతాలో భారీ డ్రగ్​రాకెట్​ను పోలీసులు మంగళవారం ఛేదించారు. ఇద్దరు డ్రగ్​ ట్రాఫికర్లను అరెస్టు చేసి, వారి నుంచి 25 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.105 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు చెప్పారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే ప్రథమం అని అన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని పైక్​పారా ఏరియాలో పోలీసులు సోదాలు చేశారు. ఓ ఇంట్లో తలదాచుకున్న యూపీ డ్రగ్​డీలర్​జుబేర్​ను, మణిపూర్​కు చెందిన మౌలానా ఫయాజుద్దీన్​ను అదుపులోకి తీసుకున్నారు.

జుబేర్​ నుంచి 20 కిలోల హెరాయిన్​ను, ఫయాజుద్దీన్​ నుంచి 5.25 కిలోల హెరాయిన్​ను  స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్​ను ఇతర డ్రగ్స్​తో కలిపి లోకల్​గా డిస్ట్రిబ్యూట్​ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. జుబేర్, ఫయాజుద్దీన్​లపై నార్కోటిక్  డ్రగ్స్​చట్టం కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

see also: ఏమైనా చేస్కోండి సీఏఏ ఉంటది

 

Latest Updates