ఇంటర్ టాపర్ కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి సర్‌ ప్రైజ్‌ చేసిన తాప్సి

మనకిష్టమైన వారికి సర్‌ ప్రైజ్​ గిఫ్ట్స్‌ ఇచ్చి ఆనందపడుతుంటాం. అయితే తనకి ఏమీ కాని ఓ అమ్మాయికి ఓ కాస్ట్‌‌‌‌లీ గిఫ్ట్ అచ్చి సర్‌ ప్రైజ్ చేసింది తాప్సీ. కరోనా కారణంగా కాలేజీలు, స్కూళ్లు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు ఏమీ తెరవడం లేదు. ఆన్‌ లైన్ క్లాసుల ద్వారానే అందరూ చదువుకుంటున్నారు. కానీ అందరి దగ్గర ల్యాప్‌ టాప్స్‌‌‌‌, స్మార్ట్ ఫోన్స్ ఉండవు. కర్ణాటకలో మెడికల్ ఎంట్రన్స్ టెస్టుకి ప్రిపేరవుతున్న ఓ అమ్మాయి దగ్గర కూడా అవేమీ లేక ఇబ్బంది పడుతోంది. ముగ్గురు కూతుళ్లను పెంచడానికే అవస్థ పడుతున్న ఆ అమ్మాయి తండ్రి అవన్నీ ఎక్కడ సమకూర్చగలడు! కానీ ఈ అమ్మాయికేమో చదువంటే చాలా ఇంటరెస్ట్. పీయూసీలో నైన్టీ ఫోర్ పర్సెంట్ తెచ్చుకుంది. ఎలాగైనా డాక్టర్ అవ్వాలని కలలు కంటోంది. దాం తో తన బిడ్డ చదువుకి సాయం చేయంటూ సోషల్ మీడియాలో కోరాడు తండ్రి. అది తాప్సీ చూసింది. వెంటనే ఓ ఐఫోన్ కొని ఆ అమ్మాయికి పంపించింది. దాన్ని చూసి చాలా సంబరపడిపోయిన ఆ అమ్మాయి, ఆమె తండ్రి తాప్సీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు. ‘చదువుకునే అమ్మాయిల సంఖ్య పెరగాలి. ఎందుకంటే ప్రతి మహిళకీ చదువు అవసరం. అలాగే మనకు మరింత మంది డాక్టర్లు అవసరం. ఇలాంటి వారి చేతిలోనే మన దేశానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పడానికి నేనీ చిరు సాయం చేశాను’ అంటోంది తాప్సీ.

 

Latest Updates