విజయవాడ వ్యాపారి కంటైనర్‌‌లో రూ.9 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

విజయవాడ వ్యాపారి కంటైనర్‌‌లో రూ.9 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత
  • టాల్కమ్ పౌడర్ ముసుగులో హెరాయిన్ .. కంటెయినర్ల నిండా దొరికిన హెరాయిన్
  • గుజరాత్ లో పట్టుపడిన డ్రగ్స్ ముఠాకు ఏపీతో లింకులు

అహ్మదాబాద్: టాల్కమ్ పౌడర్ ముసుగులో భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కంటెయినర్ల నిండా టన్నుల కొద్దీ హెరాయిన్ పట్టుపడింది. గుజరాత్ లో ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) దేశంలోనే అతిపెద్ద స్థాయిలో టన్నుల కొద్దీ హెరాయిన్ ఒకేచోట పట్టుకున్నారు. పట్టుపడిన డ్రగ్స్ విలువ 9 వేల కోట్లు పేనే ఉంటుందని సమాచారం. గుజరాత్ లో పట్టుపడిన డ్రగ్స్ ముఠాకు ఏపీతో లింకులున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. 
గుజరాత్ లోని ముంద్ర పోర్టులో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కంటెయినర్ల నిండా టాల్కమ్ పౌడర్ మాటున డ్రగ్స్ దొరికాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఓ వ్యాపార సంస్థకు చెందిన కంటెయినర్లలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున హెరాయిన్ వచ్చింది. టాల్కమ్ పౌడర్ పేరుతో ఉండగా తనిఖీలు చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మా. పెద్దమొత్తం హెరాయిన్ పట్టుపడడంతో.. విచారణ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుపడడం దేశంలో ఇదే తొలిసారి.