జ్వరానికి లక్ష బిల్లు : హీరోయిన్ షాక్

మామూలుగా ఫీవర్ వచ్చిందని హాస్పిటల్ కి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ కి షాక్ ఇచ్చారు డాక్టర్లు. తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు వివరించింది ఐశ్వర్య. తనకు మామూలు జ్వరం వస్తే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాలని తెలిపిన ఐశ్వర్య… డాక్టర్లు చెప్పినట్టు ట్రీట్ మెంట్ కోసం అడ్మిట్ అయ్యానని చెప్పింది. హాస్పిటల్ లో చేరిన మరుసటి రోజే తగ్గడంతో డిశ్చార్చ్ అవుతానని డాక్టర్లకి చెప్తే.. ఆదివారం కుదరదని వారు వివరించింది.

కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు తన చేతికి రూ.లక్ష బిల్లు ఇచ్చారని ఐశ్వర్య చెప్పింది. డిశ్చార్జ్ అయ్యే సమయానికి నార్మల్ జ్వరానికి వాడే ట్యాబెట్లను చేతిలో పెట్టారని వాపోయింది. ఐశ్వర్య రాజేశ్.. త్వరలోనే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తనకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నట్లు తెలిపింది.

Latest Updates