నేనెప్పుడూ హాటే!

‘తెలుగమ్మాయి’ అనే ట్యాగ్ లైన్ తన కెరీర్‌‌కి మైనస్ కాదంటోంది ఈషా రెబ్బా. ఆమె ప్రధాన పాత్రలో శ్రీనివాసరెడ్డి రూపొందించిన ‘రాగల 24 గంటల్లో’ చిత్రం నవంబర్ 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈషా చెప్పిన విశేషాలు.

  • ‘ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నటించే అవకాశం రావడం అరుదు. అందుకే ఇందులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్ర పేరు విద్య. కథ చెప్పినప్పుడే విద్య చుట్టూ అల్లుకున్న కథని చెప్పారు. చాలా ఎంగేజింగ్‌గా ఉండే స్టోరీ.
  •  ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. కథ నేరేట్ చేసేటప్పుడు విజువలైజ్ చేసుకున్నాను. తరువాత ఏం జరగబోతోందనేది ఊహించడానికి ప్రయత్నించాను. కానీ నా అంచనా చాలాసార్లు తప్పింది. ఊహకందని మలుపులు ఉంటేనే సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించగలుగుతుంది. అందుకే అంగీకరించాను.
  • ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేయాలనే కోరిక ఎంత ఉన్నా, చేసేటప్పుడు చాలా స్ట్రెయినయ్యాను. సినిమా అంతా నా భుజాలపై మోయాల్సి వచ్చింది. పైగా నా పాత్రలో కోపం, ప్రస్ట్రేషన్ లాంటి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. దీంతో మెంటల్‌గా కూడా అలసిపోయాను. అదే సమయంలో ఓ తమిళ సినిమాలో కూడా నటిస్తుండటంతో ఫిజికల్‌గానూ ఒత్తిడి తప్పలేదు.
  • శ్రీనివాసరెడ్డిగారు తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. చాలా బాగా డీల్ చేశారు. నన్నయితే చాలా అందంగా చూపించారు. ఆయన నన్ను నయనతారతో పోల్చడం హ్యాపీ. నాదనే కాదు, అన్ని పాత్రలకీ సినిమాలో ప్రాధాన్యత ఉంటుంది.
  • ఇందులో హాట్‌గా కనిపిస్తున్నానంటున్నారు. కానీ నేనెప్పుడూ హాట్‌గానేఉంటాను. రకరకాల కాస్టూమ్స్ వేసుకోవడం ఇష్టం. అయితే ఇప్పటివరకూ పోషించినవన్నీ తెలుగమ్మాయి పాత్రలు కనుక ట్రెడిషనల్‌గా చూపించి నన్ను స్టీరియోటైప్ చేశారు. గ్లామర్ పాత్రలు చేయనని నేనెప్పుడూ చెప్పలేదు. విలక్షణ పాత్రలు పోషించాలని ఉంది.
  •  తెలుగమ్మాయి అనే ట్యాగ్ లైన్ నా కెరీర్‌‌కి మైనస్ అని నేను భావించడం లేదు. కానీ తెలుగమ్మాయిలకు ఒకేలాంటి రోల్స్ రావడం, ఆ వచ్చే అవకాశాలు కూడా తక్కువ కావడం వంటి స్ట్రగుల్స్ ఉంటాయి. అలాగని కెరీర్ లో నాకు ఎలాంటి అసంతృప్తీ లేదు.
  • తమిళంలో జీవీ ప్రకాష్‌తో కలిసి నటించిన చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కన్నడలో శివరాజ్ కుమార్‌‌తో ఓ సినిమాలో నటిస్తున్నాను. తెలుగులో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేశాను. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్, ఆషిమా ఇతర పాత్రలు పోషించారు. అందరూ అనుకుంటున్నట్టు ఇది హిందీ వెర్షన్‌కి రీమేక్ కాదు. ఓ తెలుగు సినిమా కోసం కథా చర్చలు జరుగుతున్నాయి. ఓకే అయ్యాక వివరాలు చెబుతాను.

ఫెయిల్యూర్స్‌ వస్తే డిజప్పాయింట్ అవను. పెద్ద హీరోలతో నటించలేదని బాధ కూడా పడను. వచ్చిన వాటిలో నాకు సరిపడే  పాత్రలు చేస్తున్నాను.  కథ నచ్చితేనే అంగీకరిస్తాను. గొప్ప టీమ్ దొరికి కథ కాస్త అటూ ఇటూగా ఉన్నా ఓకే అంటాను. ఎందుకంటే అది కెరీర్‌‌కి హెల్ప్​  అవుతుంది.

Latest Updates