కాజల్‌ కబ్జా చేస్తుందా!

హీరోలతో పోలిస్తే హీరోయిన్లు త్వరగానే ఫేడవుట్ అవుతుంటారు. కానీ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం అందుకు విరుద్ధం. 2007లో కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. ఇప్పటికీ టాప్ హీరోయిన్‌ గానే వెలుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఓ ఆంగ్ల చిత్రంలోనూ మెరవనుంది. ఇప్పుడు కన్నడ సీమలో కూడా అడుగు పెట్టేందుకు రెడీ అవు తున్నట్లు తెలిసింది. ఉపేంద్ర హీరోగా ఆర్‌‌‌‌.చంద్రు ఓ చిత్రాన్ని తీస్తున్నారు. రీసెంట్‌‌గా సెట్స్‌ కి వెళ్లిన ఈ మూవీలో హీరోయిన్‌ గా కాజల్‌ ని ట్రై చేస్తున్నారట. ఆల్రెడీ ఆమెకి కథ నచ్చిందట. కాకపోతే డేట్స్ సెట్ కావట్లేదట. ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తుందేమోనని వెయిట్ చేస్తున్నారు. జగపతిబాబు విలన్‌ గా నటిస్తున్నాడు. ఇతర పాత్రలకి మనోజ్ బాజ్ పాయ్, నానా పటేకర్, ప్రకాష్‌ రాజ్, సముద్రఖని వంటి వారిని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎనభైల కాలం నాటి కథ. ఉపేంద్ర డాన్ పాత్రలో కనిపిస్తాడు. ముంబై, మధురై, బెంగళూరు, మంగుళూరు నగరాల్లో తీయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్​తో శాండిల్​వుడ్ లో  అడుగుపెడితే కాజల్​ కెరీర్ కి మంచిదే మరి!

Latest Updates