సైబర్ క్రైమ్ పోలీసులకు నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో శాక్రిఫైజింగ్ స్టార్ గా చెలామణి అవుతున్న సునిషిత్ పై  హీరోయిన్ లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నట్లు సునిషిత్ ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన లావణ్య త్రిపాఠి తన అసిస్టెంట్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని సునిషిత్ పెళ్లి చేసుకుంటున్నట్లు యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు లో పేర్కొంది. ఈ సందర్భంగా  హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం ప్రసాద్ మాట్లాడుతూ లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఆయన..యూట్యూబ్ చానెల్స్ లో సునిషిత్ చేసిన వాఖ్యల్ని పరిశీలించామని అన్నారు. సునిషిత్ ఇతర సెలెబ్రిటీల పై కూడా వ్యాఖ్యలు చేశాడని, ఆడవారి పై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఫిర్యాదు పై కేసు నమోదు చేశామని,ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తామని సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం ప్రసాద్ తెలిపారు.

more news :

see this – ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ మనుషుల కోసం కాదు

see this – స్టార్ క్రికెటర్ కు కరోనా వైరస్

see this – ప్లీజ్ మమ్మల్ని కరోనా వైరస్ అని పిలవొద్దు

see this – తెలంగాణలో మద్యంతో పాటు ఏఏ ఛార్జీలు పెరుగుతున్నాయంటే

Latest Updates