అదృష్టం కాదు.. కష్టానికి ఫలితం : రష్మిక

స్టార్ హీరోల సినిమాలైనా సరే…స్క్రిప్ట్ నచ్చితేనే నటిస్తా నంటోంది రష్మిక మందాన్న. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 26న రిలీజ్ కానుంది. బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత ఈ చిత్రాన్ని చూసి, హిందీలో నిర్మించనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు. అంతగా హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురించి , అందులో తన పాత్ర గురించి రష్మిక చెప్పిన విశేషాలు.

లిల్లీ, బాబి అనే పాత్రల ప్రయాణమిది. ఇద్దరి నడుమ ప్రేమ ఎలా చిగురిం చింది, వారి
ప్రయాణం ఎలా సాగింది అనేది చాలా ఎమోషనల్‌ గా ఉంటుం ది. స్క్రిప్ట్ నచ్చి అంగీకరిం చా-
ను. అంతే తప్ప విజయ్‌‌తో సినిమా అని ఒప్పుకోలేదు. అంత సీన్ లేదు కూడా (నవ్వుతూ).

స్క్రిప్ట్ చదివినప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ కలిగింది. లిల్లీ పాత్ర నన్ను ప్రభావితం చేసిం ది. భరత్‌ గారి షార్ట్ ఫిల్మ్ కూడా చూశాను. అందులోని రియాలిటీ చాలా నచ్చింది. కొత్త దర్శకుడైనా ఆయనలోని కాన్ఫిడెన్స్ నచ్చి అంగీకరిం చాను.

స్టేట్ లెవెల్ క్రికెటర్ పాత్ర నాది. కానీ జీవితంలో ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. దాంతో ఈ సినిమా కోసం శిక్షణ తీసుకున్నాను. బేసిక్స్ తెలిశాయి. సిక్సులు కొట్టడం కష్టం. ఫోర్స్ మేనేజ్ చేయగలను. క్రికెట్‌‌పై గౌరవం కూడా పెరిగింది. మొదటిసారి వరల్డ్ కప్ క్రికెట్ చూశాను. ధోనిపై విమర్శలు రావడం బాధనిపించింది.

ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలవడం ఆనందంగా ఉంది. తెలుగుతో పాటు కన్నడలోనూ నేనే డబ్బిం గ్ చెప్పుకున్నాను. తెలుగులో డబ్బిం గ్ చెప్పడానికి అరవై రోజులు పైనే పట్టింది. బయటి నుంచి చూస్తే నటన చాలా సులభంగా కనిపిస్తుంది. కానీ చాలా కష్టం. ఒక సీన్‌ లో నవ్వాలంటే ఆ నవ్వుతో ఎన్నో చూపించ గలగాలి. యాక్టింగ్ చాలా స్ట్రెస్‌‌తో కూడుకున్న పని. ప్రతిరోజు సెట్‌‌కి వెళ్లి పరీక్ష రాయడమే. డైరెక్టర్ షాట్ ఓకే చేసేవరకూ అదో పరీక్ష. ప్రతిసారీ దర్శకుడి నుంచి నువ్వు బ్రిలియెం
ట్‌‌గా చేశావ్ అనిపిం చుకోవాలి. అది ఎమోషనల్ సీన్ కావొచ్చు, మరొకటి కావొచ్చు…
ఏదైనా స్ట్రెస్‌‌ఫుల్. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం అదృష్టం అనుకోను. ఆ స్థాయికి రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను .

ప్రేక్షకుల్ని మెప్పించాలంటే కష్టపడాల్సిం దే. హీరోయిన్లకి హార్డ్ వర్క్ అవసరం లేదంటే నేను నమ్మను. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలంటే హార్డ్ వర్క్  తప్పదు. అది అదృష్టం వల్ల రాదు. అందుకే అంటున్నా… ఈ అవకాశాలు నాకు అదృష్టం వల్ల రాలేదు. కచ్చి తంగా నా హార్డ్ వర్కే.
నేను యాక్టర్​ని కాదని, నటన రాదని ప్రతిరోజు ఎవరో ఒకరు చెబుతుంటారు. నేను ఏదైనా
చేయలేను అనేవాళ్లకి నేనేమీ చెప్పను, చేసి చూపిస్తాను .. అంతే.

స్సిం గ్ సీన్స్‌‌ అనేవి చూసేవాళ్ల ఆలోచనావిధానాన్ని బట్టి ఉంటాయి. కావాలని చూస్తే అవి మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమా ట్రైలర్‌ నే తీసుకుం టే కొందరికి కిస్ మాత్రమే కనిపిస్తే ఇంకొందరికి కంటెం ట్ కనిపించింది. ఎవరేమనుకున్నా ఆ పాత్రల్లో మేము నటించామంతే. విజయ్‌‌తో డేటింగ్ చేస్తున్నానన్న వార్తల్లో నిజం లేదు. వరుస షూటిం గ్స్ కారణంగా ఒక్కోసారి తిండి తినడమే మర్చిపోతున్నాం. అలాంటిది ఇక డేటింగ్‌‌కి సమయం ఎక్కడిది! అయామ్‌‌ సింగిల్ .

తెలుగులో ‘భీష్మ’ చిత్రం లో నటిస్తున్నాను. మహేష్, అల్లు అర్జున్‌ గారి సినిమాల షూటింగ్స్‌‌లో నేనింకా జాయిన్ అవలేదు. ఇవి కూడా స్టార్ కాస్టింగ్ గురించి కాకుండా స్క్రిప్ట్ నచ్చి అంగీకరించినవే. తమిళంలో కార్తి గారితో ఒక సినిమా సైన్ చేశాను. ఇంకొకటి చర్చల దశలో ఉంది. కన్నడ చిత్రం ‘పొగరు’లో నటిస్తు
న్నాను. కొందరు అంటున్నట్టు కావాలని కన్నడ సినిమాలు తగ్గించడం లేదు. స్క్రిప్ట్
నచ్చి తే గుజరాతీ చిత్రం చేయడానికైనా సిద్ధం.

Latest Updates