చేసింది రెండు సినిమాలే.. కానీ భలే ఛాన్స్ కొట్టేసింది

చేసినవి రెండు సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్​ ఉన్న హీరోయిన్స్​ లిస్ట్​లో చేరిపోయింది తార సుతారియా.  2010లో చైల్డ్​ ఆర్టిస్ట్​గా టెలివిజన్​ రంగంలో అడుగుపెట్టింది. పోయినేడు ‘స్టూడెంట్​ ఆఫ్​ ద ఇయర్​ 2’తో బాలీవుడ్‌లో ఎంటరయ్యింది. పునీత్​ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్​ సక్సెస్​ అయి తారాని తారస్థాయికి తీసుకెళ్లింది. వెంటనే మిలాప్​ జవేరీ దర్శకత్వంలో ‘మర్జావా’తో వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా తారాకి మాత్రం మంచి పేరే తెచ్చింది.

ప్రస్తుతం మిలన్​ లూథ్రియా దర్శకత్వంలో సాజిద్​ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న టాలీవుడ్​ సూపర్​ హిట్​ మూవీ ‘ఆర్‌‌.ఎక్స్.100’ రీమేక్‌లో లీడ్​ రోల్‌కి తారను తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్​ ఇంకా పూర్తవ్వకుండానే తార ‘ఏక్​ విలన్​ 2’లో మంచి ఆఫర్​ పట్టేసింది. ‘ఏక్​ విలన్​’ సినిమాకి ఇది సీక్వెల్​.  మోహిత్​ సూరి దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘ఏక్​ విలన్​’ సూపర్​ డూపర్​ హిట్టయ్యింది. దీనిలో రితేష్​ దేశ్​ముఖ్​, సిద్ధార్థ మల్హొత్రా, శ్రద్ధా కపూర్​ లీడ్​ రోల్స్​ చేశారు. సీక్వెల్‌లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒకరు దిశాపటాని, రెండో హీరోయిన్‌గా తారను సెలెక్ట్​ చేశారు. ఆదిత్యా కపూర్‌‌కి జోడీగా తార, జాన్​ అబ్రహామ్‌కి జోడీగా దిశ కనిపించనున్నారు. ఏక్తా కపూర్​, భూషణ్​ కుమార్‌‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సింగర్‌‌గా కనిపిస్తుందిట తార. కానీ నిజంగానే సినిమాలో తనే పాడేందుకు ట్రైనింగ్​ తీసుకుంటూ ప్రాక్టీసు కూడా చేస్తోందట. ‘డైరెక్టర్​ అడిగింది చెయ్యడమే ఆర్టిస్ట్​ కర్తవ్యం’ అని కూడా అంటోంది. ‘‘ఈ సినిమాలో ఆమె రోల్​ ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే తను కూడా చేస్తోంది’’ అంటూ తార హార్డ్​ వర్క్​ చూసి మోహిత్​ సూరి కూడా తెగ ఇంప్రెస్​ అయిపోతున్నాడట. అంత కష్టపడుతోంది కాబట్టే మంచి సినిమాలు వస్తున్నాయేమో అంటున్నారంతా.

 

Latest Updates