పచ్చని పంట పొలాల్లో ముద్దుగుమ్మల ప్లెక్సీలు : మంచి రాబడి వచ్చిందంటూ మురిసిపోతున్న రైతన్న

సిద్దిపేట జిల్లా : పంట పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం కామన్. కానీ ఓ రైతు కష్టపడి పండించిన పచ్చని పంటలు చేతికి వచ్చేసరికి ఏదో ఒక తెగుళ్లు వస్తున్నాయని ఓ ప్లాన్ వేశాడు. పంట నష్టానికి నరదిష్టే కారణమని భావించిన రైతు పొలాల్లో హీరోయిన్ల ప్లెక్సీలను సెట్ చేశాడు. సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండ‌లం, చందలపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే రైతు ప్రతి ఏటా 2ఎక‌రాల్లో మిర్చి పంటను పండిస్తున్నాడు. ప్రతిసారి పంట బాగా పండతుంది కానీ.. కోత సమయానికి ఏదో ఒక తెగుళ్లు రావడంతో దిగుబడి తగ్గిపోతుందని చెప్పాడు.

నరదిష్టే కారణమని భావించిన చంద్రమౌళి తన పొలాల్లో గత ఏడాది దిష్టిబొమ్మలకు బదులు హీరోయిన్ల ప్లెక్సీలను సెట్ చేశాడు. దారినపోయే వారి దృష్టి మరల్చేలా తన అభిమాన హీరోయిన్ లు తమన్నా, కాజల్ ల ప్లెక్సీ లు పెట్టినట్లు చెప్పాడు. ప్లెక్సీలు చూసినవారి ఫోకస్ మొత్తం పంటలపై పడకుండా ముద్దుగుమ్మల ఫొటోలపై మళ్లడంతో పంట బాగా పండిందని తెలిపాడు. కొద్దిరోజుల్లోనే కూరగాయలు చేతికొస్తున్నాయని తెలిపిన ఆయన.. ఈ సంవత్సరం కూడా అలాగే ప్లెక్సీలు ఏర్పాటు చేసి, అందరి దృష్టిని అక్షర్శిస్తున్నాడు.

Latest Updates