ఓటమి అంచున భారత్: సెంచరీతో చెలరేగిన హెట్‌మైర్

విండీస్ యంగ్ ప్లేయర్ షిమ్రాన్ హెట్‌ మైర్ భారత్ కు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదివారం ఇండియా, వెస్టిండీస్ మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డేలో విండీస్ బ్యాట్స్‌మెన్ హెట్‌ మైర్ చెలరేగి ఆడుతున్నాడు.  288 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ .. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన హెట్‌ మైర్(85 బాల్స్ లో100 :86 ఫోర్లు,4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో విండీస్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం విండీస్ 34 ఓవర్లలో వికెట్ నష్టానికి 181 పరుగులు చేసింది. హెట్‌మైర్‌కు తోడు ఓపెనర్ షై హోప్(60) క్రీజులో ఉన్నాడు. భారత్ బౌలర్లు విండీస్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి, వికెట్లు తీస్తే తప్ప.. గెలిచేలా కనిపించడంలేదు.

Latest Updates