జీన్స్ ప్యాంట్ జిప్ భాగంలో బంగారం ముక్కలు దాచి..

దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి..

హైదరాబాద్: విదేశాల నుండి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో చెకింగ్ కళ్లు గప్పేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు ఊహించని రీతిలో బయటపడుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా జీన్స్ ప్యాంట్ జిప్ భాగంలో బంగారాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రత్యేకంగా కుట్టించుకుని వస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కొత్త స్టైల్.. నా స్టేటస్ అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు.  బంగారం అక్రమంగా తరలించడం కింద నేరమవుతుందంటూ శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద 71 గ్రాముల గోల్డ్ సీజ్ చేశారు. మొత్తం 12 చిన్న చిన్న ముక్కలను లను జీన్స్ పాయింట్ జీప్ భాగంలో దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం రూ. 3 లక్షలు విలువ చేస్తుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Latest Updates