అయోధ్య తీర్పు, చలో ట్యాంక్ బండ్: పోలీసుల గుప్పిట్లో పట్నం

నేడు అయోధ్య తీర్పు రానుండటంతో దేశ వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు.ఇందులో భాగంగా.. పొద్దున ఆరు నుంచే నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బ్యారీ కేడ్లు ఏర్పాటు చేశారు.  తీర్పు ఎలా ఉన్నా సంయమనం పాటించాలని ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షా ప్రజలను కోరారు. దీంతో పాటు ఎవరు కూడా సంబరాలు, నిరసనలు తెలుపవద్దని పోలీసులు కోరారు. సోషల్ మీడియాలో రెచ్చకొట్టే పోస్టులు పెట్టవద్దని తెలిపారు.
ఇటు ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కూడా శనివారం ఉండటంతో పోలీసులు నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలనన్నింటిని పోలీసులు మూసివేశారు. ఎటు వైపునుంచి కూడా కార్మికులు ట్యాంక్ బండ్ కు రాకుండా ఏర్పాట్లు చేశారు.

Latest Updates