కూల్చేసినంకపోయి ఇప్పుడు ఏం చూస్తారు?

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్‌ ఆవరణలో గుడి, మసీదులను ప్రభుత్వం ఎలా కూల్చేసిందో దర్యాప్తు చేసేందుకు అనుమతివ్వాలన్న కాంగ్రెస్‌‌ నేతల వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. గుడి, మసీదులు పొరపాటున కూలిపోయాయో, కావాలనికూల్చేశారో తేల్చాల్సింది ప్రజాప్రతినిధులు కాదని, వారికి దర్యాప్తు చేసే అధికారం లేదనిస్పష్టం చేసింది. జానిజాలు తేల్చాలని పురావస్తు శాఖను కోరడానికి ఉన్న అడ్డంకి ఏమిటని, దాదాపు కూల్చివేత పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు సెక్రటేరియట్‌‌లోకి వెళ్లిఏం చూస్తారని ప్రశ్నించిం ది. నల్లపోచమ్మ ఆలయం, మసీదులను తిరిగి నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేసింది. కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతించాలన్న కాంగ్రెస్‌‌ నేతల పిల్‌‌ను చీఫ్‌‌జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డితో డిన డివిజన్‌‌బెంచ్‌ సోమవారం విచారించింది. సెక్రటేరియట్‌‌ ఆవరణలో గుప్తనిధులు ఉన్నాయని వార్తలు వచ్చాయని, 132 ఏండ్లనాటి జి బ్లాక్‌‌ (సైఫాబాద్‌‌ప్యాలెస్‌‌)లో కీలకమైన నిధులు ఉండవచ్చని, 200ఏండ్లనాటి ఆలయం, నిజాం కాలం నాటి మసీదుల కూల్చివేత పనుల్ని పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని షబ్బీర్‌‌అలీ, రేవంత్‌‌రెడ్డి, అంజన్‌‌కుమార్‌‌ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డిపిల్‌‌ వేశారు.

గుప్త నిధులపై ఆధారాలున్నాయా?

పురాతన ఆలయం, మసీదు పొరపాటున కూలిపోయాయని ప్రభుత్వం చెబుతోందని, ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు అనుమతివ్వాలని డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని పిటిషనర్ల తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కాంగ్రెస్‌‌నేతల దరఖాస్తులపై ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏజీ వాదనలు వినిపిస్తారని, 2 వారాల గడువిస్తే కౌంటర్‌‌దాఖలు చేస్తామని ప్రభుత్వ లాయర్ చెప్పారు. సెక్రటేరియట్‌‌ ఏరియాలో గుప్తనిధులు ఉన్నా యనడానికి ఉన్న ఆధారాలు ఏమిటని కోర్టు పిటిషన్లను ప్రశ్నించింది. పురాతన ఆలయాన్ని కూల్చేశారని చెబుతున్నప్పుడు దీనిపై దర్యాప్తు కోరుతూ కేంద్ర పురావస్తు శాఖను కోరాలని బెంచ్స్పష్టం చేసింది. ప్రభుత్వం కౌంటర్‌‌దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది,

Latest Updates