ఆ వెబ్ సిరీస్ అంతా అశ్లీలతే..కేసు ఎలా కొట్టేస్తాం

ప్రముఖ దర్శక నిర్మాత ఏక్తాకపూర్ కు మధ్య ప్రదేశ్ హైకోర్ట్ షాకిచ్చింది. సాకేత్ శాన్వే నిర్మాతగా కేన్ గోష్, ప్రభాకర్ దర్శకత్వంలో త్రిబులెక్స్ పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఆ వెబ్ సిరీస్ ను ఏక్తాకపూర్ ఫౌండర్ అయిన ఓటీటీ సంస్థ ఆల్ట్ బాలాజీలో 2018లో విడుదలైంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పార్ట్ – 2  విడుదల కానున్న నేపథ్యంలో ఐదు నెలల క్రితం ఏక్తాకపూర్ తన ఓటీటీ సంస్థ ద్వారా అశ్లీలతతో పాటు దేశ సంస్కృతిని దెబ్బతీస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఏక్తా కపూర్ పై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసు నుంచి విముక్తి కలిగించాలంటూ ఏక్తా కపూర్ మధ్యప్రదేశ్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్ట్ ఏక్తా కపూర్ విజ్ఞప్తిని కొట్టిపారేసింది. వెబ్ సిరీస్ లో అంతా అశ్లీలత ఉందని సూచించింది.

 

 

 

Latest Updates