అనంతగిరి భూనిర్వాసితులకు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి

తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటీషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్‌ను విచారించిన‌ హై కోర్టు … మూడు నెలల్లో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశం

కాళేశ్వరం అనంతగిరి భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని మొత్తం 120 పిటిషన్‌లు దాఖల‌వ‌గా… పిటీషన్ తరపున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు త‌న‌ వాదనలు వినిపించారు. కాళేశ్వరం అనంతగిరి ప్రాజెక్టు లో భూముల కోల్పోయిన వారికి పునరావాసం, రీ సెటిల్ మెంట్, నష్టపరిహారం చెల్లించాలని ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే భూ నిర్వాసితులను అందరినీ ఆదుకున్నామని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.

2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం, పునరావాసం,రీ సెటిల్ మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో భూ నిర్వాసితులకు సమస్యలు పరిష్కరించాలని సూచించింది.

Latest Updates