పరీక్షల వాయిదాకు ఒప్పుకోని తెలంగాణ హైకోర్టు.. రేపటి నుంచి నిర్వహించే ఛాన్స్

పీజీ మెడికల్, డెంటల్ పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులిచ్చింది. కరోనావైరస్ విజృంభిస్తోన్న కారణంగా ప్రస్తుతం పరీక్షలు నిర్వహించలేమని కాళోజీ యూనివర్సిటీ ప్రకటించింది. కాబట్టి పరీక్షల వాయిదాకు అనుమతులివ్వాలని యూనివర్సిటీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షల వాయిదాపై స్పందించిన హైకోర్టు.. వాయిదాకు ఒప్పుకోలేదు. దాంతో కాళోజీ యూనివర్సిటీ అధికారులు..పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. ఒకవేళ రేపటి నుంచి పరీక్షలు నిర్వహిస్తే.. ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్ధులు.. సప్లిమెంటరీ పరీక్షలు రాస్తే వారిని కూడా రెగ్యులర్ పాస్ అవుట్ గానే పరిగణిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో కరోనా నిబంధనలు పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

For More News..

తండ్రి కోసం దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు

ప్రైవేట్ దందా.. ఐసోలేషన్ బెడ్ రోజుకి రూ. 24,000-25,000

Latest Updates