ఏందీ మొద్దు నిద్ర? : రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఫైర్

కరోనా టెస్టులపై ఎందుకింత నిర్లక్ష్యం?
మీ తీరుప్రజలజీవించేహక్కును కాలరాయడమే..
ఏపీలక్షల్లో టెస్టులుచేస్తుంటే.. ఇక్కడెందుకుచేస్తలేరు?
బులెటిన్లలోపూర్తి ఇన్ఫర్మేషన్ఇవ్వండి..ర్యాపిడ్టెస్టులుచేయండి
మాఆదేశాలుఈనెల17లోగాఅమలుచేయాలి
లేకుంటేసీఎస్,హెల్త్,మున్సిపల్ డిపార్ట్మెంట్ల
ప్రిన్సిపల్సెక్రెటరీలుకోర్టుకు రావాల్సిఉంటుంది
సర్కారుఇస్తున్న రిపోర్టులన్నీ తప్పులతడకగా
ఉన్నాయని మండిపాటు


హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కరోనా టెస్టుల విషయంలో సర్కారు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వైరస్ మహమ్మారి కోరలు చాచిన టైంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడింది. సర్కారు స్వయంగా నిర్దేశించుకున్న మేరకు కూడా టెస్టులు చేయలేకపోవడం అలసత్వమేనని స్పష్టం చేసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలు లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తున్నాయని, తెలంగాణలో చేయడానికి ఇబ్బందేమిటని నిలదీసింది. టెస్టులు చేస్తున్నామని సీఎస్ చెప్తున్నారని, టెస్టులు ఆపేయాలంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ ఆదేశాలు ఇస్తారని.. ఏమిటీ దాగుడుమూతలు అని మండిపడింది. రాష్ట్ర సర్కారు నిర్వాకం ప్రజల జీవించే హక్కును కాలరాసేలా ఉందని కామెంట్ చేసింది. టెస్టుల వివరాలను ఇచ్చే బులెటిన్లలో అరకొర సమాచారం ఉండటమేంటని.. వార్డుల వారీగా పూర్తి వివరాలు ఇవ్వాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. దీనిని మొద్దునిద్ర అనుకోవాలా, ప్రజారోగ్యంపై పట్టువీడుతోందా అని నిలదీసింది. రాష్ట్రంలో కరోనా టెస్టుల తీరు, ట్రీట్మెంట్ పై దాఖలైన సుమారు పది పిల్స్‌‌పై చీఫ్‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వ తీరును తప్పుపట్టింది.

వివరాలు ఎందుకు దాస్తున్నారు?

కరోనా టెస్టులు, కేసులకు సంబంధించిన వివరాలను ఎందుకు దాచిపెడుతున్నారని సర్కారును బెంచ్ ప్రశ్నించింది. ‘‘జూన్‌‌17న బులిటెన్‌ చూస్తే రాష్ట్రంలో కరోనా బారినపడిన చాలా మంది 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే. అంటే యువతకే వైరస్‌ సోకిందన్న విషయం ప్రజలకు తెలియాలి కదా? మీడియాకు వెల్లడించే బులిటెన్లను హైదరాబాద్‌‌లోని కాలనీ అసోసియేషన్లకు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు ఖాతరు చేయడం లేదు. హెల్త్ ‌బులెటిన్ ‌‌వివరాల్ని రీజనల్ ‌‌పేపర్ల‌లో పబ్లిష్‌‌ చేయాలంటే ఒక్క పేపర్ కే ఎందుకు పరిమితం చేశారు. బులెటిన్లలో పూర్తి వివరాలు వెల్లడించాలని చెప్పినా అమలు చేయడం లేదు. ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? ఇలా చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడమే..” అని ఘాటుగా కామెంట్ చేసింది. రాష్ట్రంలో కంటెయిన్మెంట్‌ జోన్లుఎన్ని ఉన్నాయి, వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో
చెప్పాలని ఆదేశించింది.

సెంట్రల్ టీమ్ ఏం చెప్పింది?

కరోనా వ్యాప్తి పెరుగుతున్నందునే సెంట్రల్టీమ్ గత నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్ ‌‌వచ్చిన విషయాన్ని బెంచ్ ప్రస్తావించింది. ఆ టీమ్ ఎక్కడ పర్యటించింది, ఏం తేల్చిందో ప్రజలకు ఎందుకు తెలియజేయలేదని.. కనీసం హైకోర్టుకు కూడా నివేదిక ఇవ్వలేదేమని ప్రశ్నించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో టెస్టులు, బులెటిన్లకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఈ నెల 17వ తేదీలోగా అమలు చేయాలని..లేకుంటే ఈ నెల 20న జరిగే విచారణకు సీఎస్, హెల్త్, మున్సి పల్ ‌‌శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రజారోగ్య శాఖ డైర్టెకర్, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ స్వయంగా హైకోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొంది.

‘‘ఐసీఎంఆర్‌‌రూల్స్ ప్రకారం టెస్టులు చేస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్, సౌకర్యాల్లేక టెస్టులు చేయడం ఆపేశామని పబ్లిక్‌‌ హెల్త్ ‌‌డైరెక్టర్ ‌‌శ్రీనివాసరావు చెప్తున్నారు. అంటే ప్రజారోగ్యంపై దాగుడుమూతలు ఆడుతున్నరా? పిల్లి, ఎలుక మాదిరిగా ఉంటే ఎలా? ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు? టెస్టులు నిలిపేయడమంటే కోర్టు ధిక్కారం అవుతుందని శ్రీనివాసరావుకు తెలియదా? మీన మేషాలు లెక్కిస్తుంటే ఈ వ్యవహారంమరో రెండేళ్ల వరకూ కొనసాగుతూనే ఉంటుంది.” అని బెంచ్ స్పష్టం చేసింది.

సూర్యాపేట జిల్లా కరోనా రిపోర్టు ప్రకారం గత నెల 27 నాటికి ఆ జిల్లాలో సేకరించిన శాంపిళ్లు 753 మాత్రమేనని.. అందులో ఎన్ని పాజిటివ్‌‌ కేసులు అన్నది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొంది. సూర్యాపేట జిల్లా కేసుల వివరాలను ఆర్టీఐర్టీ కింద అడిగితే ఎందుకు ఇవ్వడంలేదని.. వెంటనే ఇవ్వాలని ఆదేశించింది. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో కంటెయిన్మెంట్ జోన్ల‌ను గుర్తించడంలో హెల్త్ డిపార్ట్ మెంట్ ఫేయిలైందంటూ పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates