సబ్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సబ్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి గురువారం హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2012లో ట్రాన్స్ కో లోని 380 సబ్ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 2015లో ఆ ఉత్తర్వులను క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీంతో క్యాన్సిల్ పై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవగా, ఇప్పుడు 2012లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే సబ్ ఇంజినీర్లకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Latest Updates