మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఎన్నికలు ఆపాలంటూ TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన ఫిటిషన్ ను ఇవాళ కొట్టేసింది. దీంతో నోటిఫికేషన్ జారీ చేయనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. కోర్టు తీర్పుతో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

SC,ST,BC, మైనారిటీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎలా నోటిఫికేషన్ ఇస్తారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి TRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రెండు రోజుల పాటు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మున్సిపల్  ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. జనవరి 22 న 120 మున్సిపాలిటీలు, 10 కార్పోషన్లకు పోలింగ్ జరగనుంది.

ఎన్నికల షెడ్యూల్…

జనవరి 10న నామినేషన్ల దాఖలుకు  చివరి తేదీ

జనవరి 11న నామినేషన్ల పరిశీలన

జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

జనవరి 22 పోలింగ్

జనవరి 25న ఓట్ల లెక్కింపు..ఫలితాలు విడుదల

Latest Updates