వరద సాయం ఒక పార్టీ వాళ్లకే ఇస్తున్నారని నిలిపేశాం.. హైకోర్టుకు చెప్పిన తెలంగాణ ఈసీ

హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సాయం చేయాలను చెప్పింది హైకోర్టు. వరద బాధితులకు సాయం యధావిధిగా కొనసాగించాలన్న  పిటీషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వంతో  చర్చించకుండ వరద బాధితులకు రూ. 10 వేలు సాయం ఆపడం  రాజ్యాంగ  విరుద్ధమన్నారు పిటీషనర్ శరత్. ప్రభుత్వానికి ఎలక్షన్స్ ఉన్నాయని ముందుగానే తెలుసా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అకౌంట్ లో డబ్బులు  ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వరద బాధితులకిచ్చే సాయం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ కిందకు రాదని చెప్పి, 25 గంటల్లోఎలక్షన్ కమిషన్ మాట మార్చారని తెలిపారు పిటీషనర్ శరత్. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర బాడీనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయాలా అని ప్రశ్నించింది హైకోర్టు.

అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించాలని ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది హైకోర్టు. బాధితుల సాయం ఆపకూడదని ఎలక్షన్ కమిషన్ కోడ్ అఫ్ కండక్ట్ లో ఉందా? అని ప్రశ్నించింది హైకోర్టు.  కేంద్ర ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్ కు కూడా వర్తిస్తుందని చెప్పింది హైకోర్ట్. ఎలక్షన్ కంటే ముందే వరద బాధితుల సాయం పథకం  అమలులోకి వచిందన్న పిటీషనర్ శరత్..కాబట్టి ఇప్పుడు దానిని ఆపడం పొలిటికల్ ఎజెండా అవుతుందని కోర్టుకు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ అఫ్ ఫండ్ కొంతమంది పార్టీ వాళ్ళకే  ఇస్తున్నారని, కాబట్టి పథకాన్ని  ప్రస్తుతం ఆపాలని నిర్ణయించామని తెలిపింది ఎలక్షన్ కమిషన్. ఇది కేవలం ఎన్నికల జరిగేంత వరకే అపామని .. తర్వాత యధావిధిగా కొనసాగించుకోవచ్చని కోర్టుకు తెలిపింది కమిషన్. ఈ సాయం చేయడం వలన ఓటర్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పింది ఎన్నికల కమిషన్. గత నెల 20న ప్రారంభమైన ఈ పథకం పది రోజులు ఆపితే ఎలాంటి నష్టం లేదని తెలిపింది ఎన్నికల కమిషన్. దీంతో డిసెంబర్ 4వ తేదీ తర్వాత డబ్బులు పంపిణీ చేయొచ్చన్న హైకోర్ట్..తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

Latest Updates