వాల్మీకి టీమ్ కు హైకోర్టు నోటీసులు

విడుదలకు ముందే వరుణ్ తేజ్  వాల్మీకి చిత్రం వివాదాలకు కారణమవుతోంది. ఈ సినిమా టైటిల్ తమ కులస్తులను కించపరిచే విధంగా ఉందని,  వాల్మీకి అనే టైటిల్ ను తొలగించాలని బోయ హక్కులు పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన  హైకోర్టు..  సెన్సార్ బోర్డు, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్, డీజీపీ, హీరో వరుణ్ తేజ్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెల 20 న విడుదల కానుంది. తమిళ హీరో అధర్వ, హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

High court Issues notices to Valmiki Team

Latest Updates