ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వచ్చిన పిల్‌ను  ధర్మాసనం కొట్టేసింది. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రూట్ల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించే విషయంలో ప్రొసీజర్‌ను ఫాలో అవ్వాలిని సూచించింది. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఆ నిర్ణయాన్ని న్యూస్ పేపర్లలో యాడ్ ఇచ్చి, అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల టైం ఇవ్వాలని చెప్పింది. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయంపై ముందుకెళ్లాలని తెలిపింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ… రూట్ల ప్రైవేటీకరణపై ఇంకా గెజిట్ వరకు వెళ్లలేదని, ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళ్తామని కోర్టుకు చెప్పారు.

RELATED NEWS: డ్యూటీకొస్తమన్న కార్మికులు.. వద్దన్న డిపో మేనేజర్‌

అథారిటీకి ఇవ్వడంపై ప్రశ్నించిన హైకోర్టు

వాదనల సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ప్రశ్నించలేవని ఏజీ అన్నారు. దానికి అనుగుణంగా మూడు సుప్రీంకోర్టు తీర్పులను ఆయన ప్రస్తావించారు. అయితే పలు రాష్ట్రాల్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై  సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయని పిటిషనర్ తరపు అడ్వకేట్ వివరించారు. అయితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రాష్ట్రంలో రవాణా వ్యవస్థపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఏజీ వాదించారు.
ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారని ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు కేబినెట్‌ తీర్మానంలో ఉందని, ప్రభుత్వం వేరు.. అథారిటీ వేరని, ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన ఏజీ.. రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియను రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే కేబినెట్ తీర్మానంలో అలా లేదని హైకోర్టు అడిగింది. అయితే ఈ ప్రక్రియ ఇంకా చేపట్టలేదని, కోర్టు సూచనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు ఏజీ.

MORE NEWS:

అసలు టీఎస్‌ఆర్టీసీనే లేదు.. ప్రైవేటు ఎలా చేస్తారు?

ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం

లేటెస్ట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Latest Updates