నలుగురు MLCలకు హైకోర్టు నోటీసులు

కాంగ్రెస్ పార్టీ నుంచి TRSలోకి మారిన నలుగురు MLC లకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. మండలిలో కాంగ్రెస్ పార్టీని TRS లో విలీనం చేసినట్లు మండలి చైర్మన్ ప్రకటించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే శాసన మండలి చైర్మన్, మండలి కార్యదర్శితో పాటు ప్రభుత్వానికి కూడా నోటీసులు వెళ్లాయి. కాంగ్రెస్ శాసన మండలి పక్షాన్ని TRSలో విలీనం చేయాలని  ఆ నలుగురు MLCలు లేఖ ఇవ్వగా… అప్పటి  చైర్మన్  స్వామి  గౌడ్ దాన్ని ఆమోదించారు.  విలీనాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వర రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై పిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు …వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Latest Updates