
పొల్యూషన్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: జియాగూడ డంపింగ్ యార్డు పొల్యూషన్‌పై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ, మున్సిపల్, అటవీ, పర్యావరణ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు , పీసీబీ మెంబర్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, కార్వాన్ మండల తహసీల్దార్, ఖైరతాబాద్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని శుక్రవారం చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావుల డివిజన్ బెంచ్ ఆదేశించింది. జియాగూడ డంపింగ్ యార్డ్‌లో రోజూ చెత్త వేయడం వల్ల దుర్గందభరితంగా మారిందని, పొల్యూషన్సమస్య తీవ్రంగా ఉందని సైదాబాద్‌కు చెందిన లా స్టూడెంట్ కె.పవన్ హైకోర్టుకు లెటర్‌రాశారు. ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఆరేళ్లుగా పరిస్థితుల్లో మార్పు లేదని, డంపింగ్ యార్డ్‌కు కేవలం వంద మీటర్ల దూరంలోనే ఇళ్లు ఉన్నాయని, జనావాసాలు లేని ప్రాంతానికి డంపింగ్ యార్డ్ తరలించాలని ఆయన పేర్కొన్నారు. దీనిని పిల్‌గా పరిగణించిన హైకోర్టు విచారణ చేసి మార్చి18కి వాయిదా వేసింది.