మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు హైకోర్టు నోటీసులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రైవేటు వెంచర్లకు రోడ్లెయ్యడానికి గ్రామాభివృద్ధి నిధులను దారి మళ్ళించడంపై హైకోర్టు నోటీసులు ఇచ్చింది.  మంచిర్యాల జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్యతో పాటు మరో ఐదుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెల్లంపల్లి నియోజకవర్గానికి మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారంటూ… బీజేపీ నేత, గొల్లపల్లి MPTC సభ్యుడు బొమ్మన హరీఫ్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు.

2019లో బెల్లంపల్లి నియోజకవర్గానికి 2 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరవగా… వీటిల్లో కొంత మొత్తాన్ని వివిధ మండలాల్లోని అభివృద్ధికి ఖర్చు చేశారు.  బెల్లంపల్లి మండలం కన్నాల శివారుల్లో ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్ లో MLA దుర్గం చిన్నయ్య ఇల్లు నిర్మాణం చేపట్టారు. కన్నాల SC కాలనీ రోడ్డుకి, ప్రైవేట్ వెంచర్లో ఉన్నరోడ్డుని  సీసీ రోడ్లుగా మార్చడానికి ఒక కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఇక్కడే MLA ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరుడు కూడా ప్రైవేట్ వెంచర్ మొదలు పెట్టారు. ఈ రోడ్ల కోసం 53 లక్షల నిధులు కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై MPTC హరీష్ గౌడ్ వేసిన పిటిషన్ పై నోటీసులు ఇచ్చిన హైకోర్టు కేసులు వచ్చే నెల 22కు వాయిదా వేసింది.

see more news

LRS పై విచారణ.. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఎట్టకేలకు కనిపించిన జాక్ మా.. ఇన్నాళ్లు ఎక్కడ?

మిషన్ భగీరథను చూసి మనసు మార్చుకుని టీఆర్ఎస్ లో చేరా

జో బైడెన్ స్పీచ్ రాసింది కరీంనగర్ వాసి

Latest Updates