సుప్రీం చెప్పే వరకు మృతదేహాలను భద్రపరచండి

సుప్రీం కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దిశ నిందితుల డెడ్ బాడీలను భద్రపరచాలని ఆదేశించింది హైకోర్టు. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రెండు రోజుల్లో ఎన్ కౌంటర్ పై విచారించేందుకు  సుప్రీంకోర్టు నియమించిన త్రి సభ్య కమిటీ హైదరాబాద్ కు రానుందని చెప్పింది. కమిటీ మళ్లీ డెడ్ బాడీలను పరిశీలించే అవకాశం ఉందని చెప్పింది. కాబట్టి కమిటీ వచ్చే వరకు డెడ్ బాడీలను  ఫ్రీజర్ లోనే ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

నిందితుల డెడ్ బాడీలను అప్పగించాలంటూ వాళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ కౌంటర్ పై త్రిసభ్య కమిటీ వేసిన  సుప్రీంకోర్టు.. డెడ్ బాడీల అప్పగింతపై  ఎలాంటి ప్రకటన చేయలేదు. డిసెంబర్ 6 న ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి నిందితుల డెడ్ బాడీలు గాంధీ ఆస్పత్రిలోనే ఉన్నాయి.

Latest Updates