ఫీజులు కట్టకున్నా ఆన్ లైన్ క్లాసులకు అనుమతించండి

ప్రైవేట్‌‌ స్కూళ్లకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఫీజుల చెల్లింపులతో ప్రమేయం లేకుండా స్టూడెంట్లను ఆన్‌‌లైన్‌‌ క్లాసులకు అనుమతించడమే కాకుండా వార్షిక పరీక్షలకు వాళ్ల పేర్లను నమోదు చేయాలని ప్రైవేట్‌‌ స్కూల్స్‌‌ మేనేజ్ మెంట్లను హైకోర్టు ఆదేశించింది. ఆన్‌‌లైన్‌‌ ఎడ్యుకేషన్‌‌కు అనుమతి నిరాకరించరాదని బోయిన్ పల్లిలోని సేయింట్‌‌ ఆండ్రూస్‌‌, సికింద్రాబాద్‌‌లోని లూయీస్‌‌ స్కూళ్లను ఆదేశించింది. కరోనా వల్ల ఈ విద్యాసంవత్సరానికి ట్యూషన్‌‌ ఫీజును నెలవారీ మాత్రమే వసూలు చేయాలని, స్పెషల్‌‌ ఫీజులేమీ వసూలు చేయరాదని ప్రభుత్వం జీవో ఇచ్చిందని, అయితే ప్రైవేటు స్కూల్స్ అడ్మిషన్‌‌ ఫీజుతోపాటు ఏడాది ట్యూషన్‌‌ ఫీజు చెల్లించాలని డిమాండ్‌‌ చేయడాన్ని శారదా షా ఇతరులు హైకోర్టులో సవాల్‌‌ చేశారు. ట్యూషన్‌‌ ఫీజులో 50 శాతం చెల్లించాలని గతంలో సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌‌ కూడా దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది.  ప్రైవేటు స్కూల్స్‌‌కు నోటీసులిచ్చింది. అధిక ఫీజుల వసూలుపై ఆధారాలు చూపాలని పిటిషనర్లను ఆదేశించింది.  విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

For More News..

కట్​ చేసిన జీతాలు 4 వాయిదాల్లో చెల్లింపు

యాదాద్రి ఓపెనింగ్ వాయిదా

Latest Updates