వెంటనే RTC కార్మికుల జీతాలు చెల్లించాలి: హై కోర్టు

సోమవారం లోపు(అక్టోబర్ 21) ఆర్టీసీ కార్మికుల జీతాలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కార్మికుల జీతాలపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బుధవారం విచారించింది. 49 వేల190 మంది ఆర్టీసీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించలేదంటూ కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సోమవారం వరకు కార్మికుల జీతాలు చెల్లిస్తామని  ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం సమ్మె కొనసాగుతుండడంతో… సిబ్బంది లేరని కోర్టుకు వివరించింది యాజమాన్యం.  సోమవారం లోపు కార్మికుల వేతనాలు  పూర్తిగా చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు.

Latest Updates