తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు బ్రేక్

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. పాత సెక్రటేరియట్ స్థానంలో కొత్త సెక్రటేరియట్ కట్టడం కోసం పాత భననాలను ప్రభుత్వం గత మూడు రోజులుగా కూల్చివేస్తుంది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ పాత సెక్రటేరియట్ ను కూల్చివేస్తున్నారంటూ ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర్ రావ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. భవనాల కూల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం అవుతుందని పిటీషనర్ తన పిల్ లో తెలిపాడు. మున్సిపాలిటీ సాలీడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా సచివాలయం కూల్చివేత చేపడుతున్నారని అభ్యంతరం తెలిపాడు. ఆ పిల్ స్వీకరించిన హైకోర్టు.. సెక్రటేరియట్ కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని ఆదేశించింది. దాంతో సచివాలయ కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

For More News..

సెక్రటేరియట్ కూల్చివేతతో గుడి, మసీదులకు నష్టం.. మళ్లీ కట్టిస్తానన్న కేసీఆర్

పోలీసుల అదుపులో దూబే భార్య, కొడుకు

కరోనా పేషంట్ బతికుండగానే చనిపోయాడంటూ..

ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

Latest Updates