భూ నిర్వాసితులకు అన్యాయం చేయకండి

high-court-orders-to-telangana-govt-on-m

ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశం

మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఇప్పట్లో  స్టే విధించలేమని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. మల్లన్నసాగర్ నిర్వాసితుల వ్యవహారంలో దాఖలైన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపింది. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ మొత్తం 4వేల 108 ఎకరాల్లో 4వేల 61 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించినట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. నష్టపరిహారం తీసుకోవడంలో 47 ఎకరాల్లో ఉన్న బాధితులు నిరాకరిస్తున్నట్లు వివరించారు. బాధితులకు సంబంధించిన చెక్ లను కోర్టుకు డిపాజిట్ చేశారు. అయితే 47 ఎకరాల కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ పనులు ఆపలేమని తెలిపింది హైకోర్టు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని సూచించింది. చట్టం ప్రకారం అందజేస్తున్న నష్ట పరిహారాన్ని బాధితులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు.

Latest Updates