మున్సిపల్ ఎన్నికలు : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు

మున్సిపల్ చట్టంపై విచారణ చేపట్టింది హైకోర్టు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ వివరాలు కోర్టుకు తెలపాలని ఆదేశించింది. కొత్త మున్సిపల్ చట్టం వచ్చాక.. పాత యాక్ట్ ప్రకారం ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇంతకు ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి 109 రోజులు అడిగిన ప్రభుత్వం ఇప్పుడు ఎనిమిది రోజులకు ఎలా కుదించారని రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (AAG) రామచందర్ రావు ప్రశ్నించింది.

ఏ ప్రాతిపాదికన వార్డుల విభజన చేశారని AAG రామచందర్ రావును హైకోర్టు ప్రశ్నించగా.. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం జీవో నెంబర్ 78 ద్వారా  పూర్తి చేశామని తెలిపారు AAG. ఇప్పటికైతే.. పాత ఆర్డినెన్స్ ద్వారానే మున్సిపల్ ఎలక్షన్స్ జరుపుతామని ఆయన హైకోర్టుకు తెలిపారు. శుక్రవారం నూతన ఆర్డినెన్స్  కు సంబంధించిన పూర్తి వివరాలను హైకోర్టుకు అందజేస్తామని చెప్పారు AAG. దీంతో తదుపరి విచారణను శుక్రవారంకు హైకోర్ట్ వాయిదా వేసింది.

Latest Updates