దళితబంధు నిలిపివేత పిటిషన్లను విచారించిన హైకోర్టు

V6 Velugu Posted on Oct 25, 2021

దళిత బంధు ఆపేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా హైకోర్టులో  పిటిషన్లు దాఖలయ్యాయి.  దళితబంధు పథకం నిలిపి వేయాలన్న ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య , జడ్సన్,   పిటిషన్ దాఖలు చేశారు.  దళితబంధును ఎన్నిక పూర్తయ్యే వరకు నిలిపివేయాలని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్  పిటిషన్ వేసింది.

బై ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతోందని పిటిషనర్లు వాదించారు. ఒక్క హుజురాబాద్ లో మాత్రమే కాకుండా మిగతా చోట్ల కూడా స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతోందన్నారు. దళిత బంధు పథకాన్ని ఆపడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను నిలిపేయాలని హైకోర్టును కోరారు.  వీరి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజ్వర్ చేసింది

మరిన్ని వార్తల కోసం: 

మాస్కు దవడకు కాదు ముక్కుకు పెట్టుకోవాలి

పేదల సంక్షేమమే మా లక్ష్యం

సిద్ధూ వల్ల కాంగ్రెస్ పార్టీ కామెడీ షోలా మారింది

Tagged petition, judgment, abolition, dalithbandhu, High Court reserve

Latest Videos

Subscribe Now

More News